: క్రికెట్ బ్యాట్‌ తగిలి ప్రాణాలు కోల్పోయిన యువకుడు


హైదరాబాద్ లోని తాడ్‌బన్‌లోని మీరాలం ఈద్గాలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ బ్యాటు తగలడంతో ఓ యువకుడు మరణించాడు. దీనిపై  కేసు నమోదు చేసుకున్న బహదూర్‌పురా పోలీసులు పలు వివరాలు చెప్పారు. రమ్నాస్‌పురా ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ వాజిద్‌ (21) తాడ్‌బన్‌లోని మీరాలం ఈద్గాలో తన స్నేహితులతో కలిసి రెండు రోజుల క్రితం క్రికెట్‌ ఆడుతుండగా బాల్‌ను పట్టుకునే క్రమంలో వేగంగా పరిగెత్తాడు.

అయితే, అదే సమయంలో అదే గ్రౌండ్ లో మరో క్రికెట్ టీమ్ లో బ్యాటింగ్ చేస్తున్న వ్య‌క్తి మ‌రో బాల్ ను కొట్ట‌బోయాడు. ఈ క్ర‌మంలో అటుగా పరుగెత్తుకొచ్చిన వాజిద్ త‌ల‌కు ఆ బ్యాట్ త‌గిలింది. దీంతో వాజిద్‌ అక్కడే కుప్పకూలాడు. అత‌డిని మొద‌ట‌ కాచిగూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, అనంత‌రం మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తరలించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాజిద్ ఈ రోజు ఉద‌యం మృతి చెందాడు.

  • Loading...

More Telugu News