: రానున్న 30 నిమిషాల్లో కుప్పం మండలంలో పిడుగులు పడే అవకాశాలు!: వాతావరణ శాఖ హెచ్చరిక
చిత్తూరు జిల్లా కుప్పం మండలం ప్రజలకు విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 30 నిమిషాల్లో మండలంలోని కాకిమడుగు, కొత్తపల్లి మధ్య పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కుప్పం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.