: వేసవి సెలవుల్లో మిర్చియార్డు పని చేస్తుంది: గుంటూరు కలెక్టర్ కోన శశిధర్
వేసవి సెలవుల్లో మిర్చియార్డు పని చేస్తుందని గుంటూరు కలెక్టర్ కోన శశిధర్ ప్రకటించారు. మిర్చియార్డులో ఉదయం, సాయంత్రం సమయాల్లో మిర్చి కొనుగోళ్లు ఉంటాయని పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య కొనుగోళ్లు ఉండవని, వేసవిలో పని చేసే కూలీలకు అదనపు వేతనం ఉంటుందని అన్నారు. మిర్చియార్డులో వైద్య శిబిరాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా కోన శశిధర్ పేర్కొన్నారు.