: సోనియాతో రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై మాత్రం చర్చించలేదు: మమతా బెనర్జీ
త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున పోటీకి నిలబెట్టాల్సిన అభ్యర్థి అంశంపై చర్చించేందుకు ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. రాజకీయాల గురించి ఓ ముఖ్యమైన విషయాన్ని తాను సోనియా గాంధీతో చర్చించినట్టు తెలిపారు. దానితో పాటు రాష్ట్రపతి ఎన్నికలపై గురించి కూడా మాట్లాడినట్లు చెప్పారు. అయితే, రాష్ట్రపతి అభ్యర్థి పేరుపై మాత్రం చర్చ జరగలేదని అన్నారు. ఇదే అంశంపై ఇప్పటికే సోనియా గాంధీతో బీహార్ సీఎం, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా సోనియాతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.