: ఈ ప్రాజెక్టులో ఇండియా ఎప్పుడు చేరినా మాకు ఓకే!: చైనా
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ గుండా చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ వెళ్తుండటంపై నిరసన వ్యక్తం చేస్తోన్న భారత్.. చైనా నిర్వహించిన ‘వన్ బెల్ట్, వన్ రోడ్’ ప్రాజెక్ట్ సమావేశానికి గైర్హాజరైన విషయం తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్... ఈ ప్రాజెక్టులో ఇండియా చేరాలని తాము కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. భారత్ ఇందులో చేరడానికి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచుతామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ప్రాంతీయ శాంతి, సౌభాగ్యాల కోసమేనని అన్నారు. ఇతర దేశాలతో ఘర్షణ పడేందుకు కాదని వ్యాఖ్యానించారు. కశ్మీరు సమస్యపై తమ దేశ వైఖరిని ఇది మార్చబోదని అన్నారు.