: ’బాహుబలి-2’ చూసిన ములాయం సింగ్


సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తన కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి ‘బాహుబలి-2’ చిత్రాన్ని వీక్షించారు. ఈ సినిమా చూసేందుకు లక్నోలోని ఓ థియేటర్ ను ఆయన బుక్ చేసుకోవడం విశేషం. ఆ థియేటర్ లోని వీఐపీ లాంజ్ లో ఈ సినిమాను ఆయన వీక్షించారు. అషు మాలిక్, మహమ్మద్ షాహిద్ తదితర సీనియర్ నేతలు ములాయం వెంట ఉన్నారు. కాగా, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఆయన వర్గం వారు మాత్రం ఈ సినిమా చూసేందుకు రాలేదు.

  • Loading...

More Telugu News