: సోనియా గాంధీతో మమతా బెనర్జీ భేటీ
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆమె సోనియాతో భేటీ అయ్యారు. ఎన్డీఏ అభ్యర్థికి పోటీగా విపక్షాల నుంచి ఉమ్మడి అభ్యర్థిని పోటీకి దింపే అంశంపై వారు చర్చిస్తున్నారు. విపక్ష పార్టీలు గాంధీ మనవడు గోపాలకృష్ణగాంధీని రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలోకి దింపాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఆయనకు ఇప్పటికే మమత బెనర్జీ, లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. వచ్చేనెల రెండో వారంలో రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తోంది.