: ట్రంప్ తో భేటీ అయిన అబుదాబి రాజు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో అబుదాబి రాజు జయెద్ అల్ నయాన్ భేటీ అయ్యారు. వైట్ హౌస్ లో వీరి సమావేశం జరిగింది. శ్వేతసౌధానికి వచ్చిన జయెద్ ను ట్రంప్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య, భద్రత, ద్వైపాక్షిక పెట్టుబడులు తదితర అంశాలపై వీరు చర్చించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, జయెద్ తమకు ప్రత్యేకమైన అతిథి అని... ఎంతో గౌరవించదగిన వ్యక్తి అని కొనియాడారు. అబుదాబిని తాను ప్రేమిస్తున్నానని... మీరందరూ కూడా ప్రేమించండని అమెరికన్లను ఉద్దేశించి అన్నారు. త్వరలోనే సౌదీ అరేబియా పర్యటనకు ట్రంప్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.