: రజనీకాంత్ రాజకీయాల పట్ల స్టాలిన్ స్పందన
దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి తప్పకుండా వస్తానని సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల పట్ల డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ స్పందించారు. రాజకీయాల్లోకి రజనీ రావడం, రాకపోవడం ఆయన వ్యక్తిగత విషయమని చెప్పారు. రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమానులు కోరుకుంటున్నారని... కానీ, తుది నిర్ణయం ఆయన ఇష్టంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. ఇందులో తాను చెప్పడానికి ఏమీ లేదని తెలిపారు. నిన్నటి నుంచి రజనీకాంత్ తన అభిమానులతో సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. వారితో కలసి ఆయన ఫొటోలు కూడా దిగుతున్నారు. ఈ నేపథ్యంలో రజనీ రాజకీయ అరంగేట్రంపైనే తమిళనాట భారీ ఎత్తున చర్చ జరుగుతోంది.