: ఏ సాధించారని సంబరాలు?: బీజేపీపై రాహుల్ ఫైర్
ఎన్డీయే ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ సంబరాలను నిర్వహించబోతోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఏం సాధించారని మీరు సంబరాలు చేసుకోవాలనుకుంటున్నారో చెప్పండని ప్రశ్నించారు. దేశంలోని రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు, సరిహద్దుల్లో జవాన్లు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఉద్యోగాల కోసం యువత నిరీక్షిస్తూనే ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని విమర్శించారు. దేశ ప్రజలను మోదీ ప్రభుత్వం దారుణంగా మోసగించిందని మండిపడ్డారు. కాగా, 'మోదీ ఫెస్ట్' పేరుతో మే 26 నుంచి జూన్ 15 వరకు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. గౌహతిలో ప్రధాని మోదీ బహిరంగసభతో ఈ సంబరాలు ప్రారంభమవుతాయి.