: అదరగొడుతున్న ‘బీకామ్‌లోని ఫిజిక్స్ లాగా’ పాట!


టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న కొత్త చిత్రం అంధగాడులో ‘బీకాంలోని ఫిజిక్స్‌లాగా.. నీ నడుమెక్కడే నాజూకు తీగ’ అంటూ లిరిక్‌ను వాడి ప్రేక్ష‌కుల‌ను అక‌ర్షించే ప్ర‌య‌త్నాలు చేస్తోంది ఆ సినిమా యూనిట్‌. పిల్ల మైండ్ బ్లోయింగే.. సూప‌ర్ డూపర్ నీ గ్లామ‌ర్‌.. అంటూ ప్రారంభ‌మ‌య్యే ఓ పాట‌లో బీకాంలోని ఫిజిక్స్‌లాగా అంటూ ఈ లిరిక్ క‌నిపిస్తోంది. రామజోగయ్య శాస్త్రి ఈ లిరిక్స్‌ను రాయ‌గా శేఖర్ చంద్ర బాణీలు సమకూర్చారు. ఈ పాట‌లో రాజ్‌ తరుణ్- హెబ్బాపటేల్ చిందులు వేస్తూ క‌న‌ప‌డుతున్నారు. ఈ పాట‌ను ఆ సినిమా బృందం సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. రాజ్ త‌రుణ్‌- హెబ్బాప‌టేల్‌లు ఇంత‌కు ముందు కుమారి-21 ఎఫ్‌తో సూపర్ జోడీ అనిపించుకున్న విష‌యం తెలిసిందే. ఈ పాటను మీరూ వినండి...

  • Loading...

More Telugu News