: ప్రియుడు మోసం చేయడంతో... ఆత్మహత్య చేసుకున్న టీచర్
కాకినాడకు చెందిన శిరీష అనే ఓ యువతి పిఠాపురంలోని ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ బీటెక్ చదువుతోంది. ఆమెకు విజయరత్నం అనే ఓ యువకుడితో స్నేహం ఏర్పడి, ఆ తరువాత ప్రేమకు దారితీసింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని, బాగా చూసుకుంటానని చెప్పిన విజయరత్నం ఆమెతో ప్రేమాయణం నడిపాడు. అయితే, రెండు నెలలుగా శిరీషతో మాట్లాడడం లేదు. గట్టిగా నిలదీసిన శిరీషతో, రూ.20 లక్షల కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని లింకు పెట్టాడు. దీంతో అతడి చేతిలో మోసపోయానని భావించిన శిరీష ఇంటికి వచ్చి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ వీడియో తీసి, తన చావుకు తన ప్రియుడే కారణమని చెప్పింది. మరో సూసైడ్ నోట్‌లో అమ్మకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు, 'అమ్మా ఐ లవ్ యూ' అని రాసింది.