: తెలంగాణలో టీడీపీతో పొత్తు లేనట్టే... ఒంటిరి పోరేనన్న బీజేపీ
రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తేల్చి చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పొత్తుకు, తెలంగాణకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో తమ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన పార్టీకి ఎంతో లాభిస్తుందని చెప్పారు. పల్లెపల్లెకు బీజీపీ - ఇంటింటికీ మోదీ నినాదంతో జనాల్లోకి వెళతామని చెప్పారు. 2019లో విజయమే తమ లక్ష్యమని అన్నారు. దేశ వ్యాప్తంగా మోదీ గాలి వీస్తోందని చెప్పారు. లక్ష్మణ్ చెప్పిన విధానాన్ని బట్టి ... ఒకవేళ ఏపీలో టీడీపీతో పొత్తు కొనసాగినా... తెలంగాణలో మాత్రం లేనట్టేనని తెలుస్తోంది.