: జగన్‌కు రాజకీయ స్థిమితం లేకే అలా ప్రవర్తిస్తున్నారు: మంత్రి సోమిరెడ్డి


ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల తీరుపై ఆ రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిప‌డ్డారు. ఓ వైపు ఎన్డీఏ త‌రఫున నిల‌బ‌డే రాష్ట్రపతి అభ్యర్థికి ఎటువంటి ష‌ర‌తులూ లేకుండా మద్ద‌తు తెలుపుతామ‌ని అంటూనే మ‌రోవైపు అదే ఎన్డీఏ ప్రవేశ పెట్టిన జీఎస్టీ బిల్లుకు అడ్డంకులు కల్పిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ఈ రోజు అమ‌రావ‌తిలోని అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద ఆయ‌న మాట్లాడుతూ... రాజకీయ స్థిమితం లేక‌పోవ‌డంతోనే జ‌గ‌న్‌ ఢిల్లీలో ఒకలా మాట్లాడుతూ అమరావతిలో మరోలా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. రైతుల స‌మ‌స్య‌లు అంటూ వైసీపీ గంద‌రగోళం సృష్టిస్తోంద‌ని, అస‌లు మిర్చి రైతుల గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీకి ఉందా? అని ఆయ‌న ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్లకార్డులను చేత‌ప‌ట్టుకొని శాస‌న స‌భాప‌తి చైర్‌ని చుట్టుముట్టడం ఏంట‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News