: తమిళనాడులో రజనీకాంత్ రికార్డును బద్దలు కొట్టిన ప్రభాస్
ఓటమి ఎరుగని దర్శకుడు రాజమౌళి.. టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్ కథానాయకుడిగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి-2 చిత్రం రికార్డుల సునామీ సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ చిత్ర పరిశ్రమల్లో ఇప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులనూ బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. తమిళ చిత్ర పరిశ్రమలో చూస్తే అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఎంథిరన్ (రోబో) చిత్రం ఉంది. ఈ సినిమా విడుదలై ఏడేళ్లవుతోంది. ఇప్పటివరకు తమిళ చిత్ర పరిశ్రమలో ఆ సినిమాపై ఉన్న అత్యధిక వసూళ్లను బాహుబలి-2 బద్దలు కొట్టింది.
బాహుబలి-2 విడుదల రోజే రజనీకాంత్ 'కబాలి', విజయ్ 'భైరవ'ల రికార్డులని బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రాష్ట్రంలోనూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి-2 మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇక తెలుగు రాష్ట్రాలలో బాహుబలి-2 చిత్రం 285 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టగా, కేరళలో 50 కోట్లు కలెక్షన్స్ సాధించింది. బాలీవుడ్ లో 434.80 కోట్ల వసూళ్ళు సాధించగా, విదేశాల్లో వంద కోట్ల కలెక్షన్స్ సాధించింది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా బాహుబలి రికార్డు నెలకొల్పింది.