: హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాను హ్యాక్ చేసి...డబ్బులడుగుతున్న రాన్సమ్ వేర్ హ్యాకర్లు
హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాను 'వానక్రై' ర్యాన్సమ్ వేర్ హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న 'పైరేట్స్ ఆఫ్ కరేబియన్:డెడ్ మేన్ టెల్ నో టేల్స్' సినిమాను హ్యాక్ చేశారు. వాల్ట్ డిస్నీ సంస్థ నిర్మించిన ఈ భారీ సినిమాను హ్యాక్ చేశామని, తాము అడిగిన మొత్తం బిట్ కాయిన్స్ రూపంలో చెల్లించకుంటే 5 నిమిషాల సినిమాను ఆన్ లైన్ లో విడుదల చేస్తామని హెచ్చరించారు.
ఈ ప్రతిపాదనకు డిస్నీ సంస్థ సీఈవో బాబ్ ఐగర్ అంగీకరించకపోవడంతో భారీ మొత్తం డిమాండ్ చేస్తూ, 20 నిమిషాల వీడియోను ఆన్ లైన్ లో ఉంచుతామని హెచ్చరించారు. 'పైరేట్స్ ఆఫ్ కరేబియన్' సిరీస్ సినిమాల్లో ఐదవ సినిమాగా 'పైరేట్స్ ఆఫ్ కరేబియన్:డెడ్ మేన్ టెల్ నో టేల్స్' విడుదల కానుంది. గత సిరీస్ లలో హీరోగా నటించిన జానీ డెప్ ఈ సినిమాలో కూడా ప్రధాన పాత్ర పోషించాడు.