: తలాక్ కు అనుకూలంగా సుప్రీంకోర్టులో గట్టిగా వాదిస్తున్న కపిల్ సిబల్!
ట్రిపుల్ తలాక్ అంశంపై సుప్రీంకోర్టులో నేడు వాదనలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ముస్లిం సంఘాల తరఫున న్యాయవాదిగా హాజరైన సీనియర్ లాయర్, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ తన వాదనలు వినిపిస్తూ, తలాక్ కు అనుకూల వ్యాఖ్యలు చేశారు. ముస్లిం సమాజంలో ట్రిపుల్ తలాక్ 1400 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆచారమని ఆయన గుర్తు చేశారు. ఇన్ని శతాబ్దాలుగా సాగుతున్న ఆచారాన్ని ఇప్పుడు రాజ్యాంగబద్ధం కాదని ఎలా అంటామని ప్రశ్నించారు. తలాక్ చెప్పడం అన్నది ముస్లింలలో పురుషుల హక్కుగా ఉండిపోయిందని అన్నారు. సిబల్ వాదనలు విన్న తరువాత ఇస్లాంలో ఈ-డైవర్స్ విషయమై అభిప్రాయం చెప్పాలని ముస్లిం పర్సనల్ లా బోర్డును కోర్టు అభిప్రాయాన్ని కోరింది.