: లాలూకు షాకిచ్చిన ఐటీ శాఖ... ఏక కాలంలో 22 చోట్ల సోదాలు


ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు షాక్ తగిలింది. రూ.1000 కోట్ల విలువైన బినామీ భూములకు సంబంధించి పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడి చేశారు. ఢిల్లీ, గుర్గావ్, రేవారీ ప్రాంతాల్లోని 22 ప్రదేశాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. పలువురు వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు సంబంధించిన ప్రదేశాల్లో ఈ సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఓ ఐటీ అధికారి మాట్లాడుతూ, ల్యాండ్ డీల్స్ కు సంబంధించి లాలూ ప్రసాద్, అతని కుటుంబంతో సంబంధాలు ఉన్న వ్యాపారవేత్తలకు చెందిన ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్టు తెలిపారు. వెయ్యి కోట్ల విలువైన బినామీ ఆస్తులు, పన్ను ఎగవేతల ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించామని చెప్పారు. లాలూతో పాటు అతని కుమారులు ల్యాండ్ డీలింగ్స్ లో మునిగిపోయారంటూ బీజేపీ నేతలు ఆరోపించిన కొన్ని రోజుల్లోనే ఈ దాడులు కొనసాగడం గమనార్హం. 

  • Loading...

More Telugu News