: అలా అనడం తప్పు.. ఆయన కేవలం రూపాయి మాత్రమే ఫీజు తీసుకుంటున్నారు: సుష్మాస్వరాజ్


ఇండియన్ నేవీ మాజీ ఉద్యోగి కుల్ భూషణ్ జాదవ్ పై పాకిస్థాన్ దేశద్రోహం కేసు నమోదు చేసి, ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పాక్ తీరు రెచ్చగొట్టేలా ఉందని, వియత్నాం ఒప్పందాన్ని పాక్ గౌరవించడం లేదని చెబుతూ అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్ భూషణ్ జాదవ్ విషయంలో భారత్ కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును భారత మాజీ సొలిసిటర్‌ జనరల్‌ హరీష్ సాల్వే వాదిస్తున్నారు.

దీనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ... హరీష్ సాల్వేకు భారీ మొత్తం ముట్టజెప్పి ఈ కేసును వాదింపజేయాల్సినంత అవసరం లేదని, ఆయనకు ఇచ్చే ఫీజులో కొంత మొత్తం ఇస్తే... ఈ కేసును వాదించేందుకు చాలా మంది ముందుకు వస్తారని పేర్కొంటూ సుష్మా స్వరాజ్ కు ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన ఆమె... 'అలా అనడం తప్పు' అని నెటిజన్ కు హితవు పలుకుతూ, ఈ కేసును వాదించేందుకు హరీష్ సాల్వే తీసుకుంటున్న ఫీజు కేవలం రూపాయి మాత్రమేనని అన్నారు. దీంతో నెటిజన్లు హరీష్ సాల్వేను అభినందిస్తుండగా, నెటిజన్ కు హితవు పలుకుతూ సందేశాలు ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News