: 120 రోజుల తర్వాత పార్టీపై దృష్టి పెడతా: నారా లోకేష్


ఏపీ యువ మంత్రి నారా లోకేష్ తొలిసారి మంత్రి హోదాలో ఈ రోజు అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతకు ముందు అసెంబ్లీ ఆవరణలో మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రస్తుతం పార్టీ పనులన్నింటినీ చంద్రబాబే చూస్తున్నారని... 120 రోజుల తర్వాత పార్టీ పనులపై తాను కూడా దృష్టి సారిస్తానని చెప్పారు. శాఖలపై పట్టు సాధించడం కోసం ఈ సమయం ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. రాష్ట్రంలో తాగు నీటి సమస్య కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని... రానున్న 45 రోజులు అత్యంత కీలకమని చెప్పారు. 

  • Loading...

More Telugu News