: మంత్రి హరీష్ రావు సభకు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి జన సమీకరణ!
నేడు నల్గొండ జిల్లాలో ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించి సమీక్షించేందుకు వస్తున్న మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టుతో జిల్లా రైతులు లబ్ధి పొందుతారని చెబుతూ, హరీశ్ రావు సభకు భారీగా జన సమీకరణ చేశారు. ఇదే సమయంలో స్థానిక టీఆర్ఎస్ నేతలు సైతం జన సమీకరణకు దిగడంతో అవాంఛనీయ ఘటనలేమైనా జరుగుతాయేమోనన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. నేడు హరీశ్ తో పాటు మరో మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపనలు చేయనున్నారు. ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకోవచ్చేమోనన్న అనుమానాలతో భారీ ఎత్తున పోలీసు బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి.