: ఫోన్ లో నారాయణను పరామర్శించిన సింగపూర్ మంత్రి
ఏపీ మంత్రి నారాయణను సింగపూర్ మంత్రి ఈశ్వరన్ పరామర్శించారు. హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఈశ్వరన్... నారాయణకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా నారాయణ కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. చేతికి అంది వచ్చిన కుమారుడు మృతి చెందడం బాధాకరమని ఈ సందర్భంగా ఈశ్వరన్ అన్నారు. నిషిత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.