: రైతుల సమస్యలను తీరుస్తున్నందుకు సభను స్తంభింపజేస్తారా?: జగన్‌కు లోకేశ్ సూటి ప్రశ్న
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖామంత్రి నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. శాసనసభను స్తంభింపజేస్తామన్న ఆయన వ్యాఖ్యలను తప్పబట్టారు. జగన్ ప్రధాని వద్ద ప్రస్తావించింది ఒకటైతే ప్రజలకు చెప్పింది మరొకటని దుయ్యబట్టారు. రైతుల సమస్యలను తీరుస్తున్నందుకు జగన్ శాసనసభను స్తంభింపజేస్తారా? అని లోకేశ్ ప్రశ్నించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాల్లోనూ మిర్చి, పసుపు రైతులకు అంతంత మాత్రంగా చెల్లిస్తుంటే, ఏపీలో మిర్చి, పసుపు రైతులను ప్రభుత్వం ఆదుకున్న విషయాన్ని జగన్ మర్చిపోయినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు.