: బెంగళూరు, హైదరాబాదుల్లో తెరుచుకోని ఏటీఎంలు


హైదరాబాదు, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ఏటీఎంలు తెరుచుకోవడం లేదు. గత మూడు రోజులుగా విండోస్ లోని లోపాల సాయంతో కంప్యూటర్లలోకి విస్తరిస్తూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ‘వన్నా క్రై’ కంప్యూటర్‌ వైరస్‌ భయంతో ఏటీఎం కష్టాలు మొదలయ్యాయి. ఏటీఎంలలో పాతతరం విండోస్ ఎక్స్ పీ సాఫ్ట్ వేర్ వాడుతుండడంతో ముందు జాగ్రత్తగా వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎంలను మూసేశారు. నిన్నటికే ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలు మూతపడగా, నేడు ప్రభుత్వ బ్యాంకులు కూడా మూసేయిస్తున్న ఏటీఎంల జాబితాలో చేరాయి. దీంతో బెంగళూరు, హైదరాబాదు వంటి నగరాల్లో పలువురు డిజిటల్ సేవలను వినియోగించుకుంటుండగా, సాధారణ ప్రజానీకం మాత్రం నగదు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కాగా, గత మూడురోజులుగా ప్రపంచవ్యాప్తంగా 'వాన్న క్రై' అనే ర్యాన్సమ్‌ వేర్‌ కంప్యూటర్లకు వ్యాపిస్తూ ఆన్‌ లైన్లో విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News