: శ్రీకాకుళం జిల్లాలో కంపించిన భూమి.. పరుగులు తీసిన ప్రజలు
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జిల్లాలోని రాజాంలో సోమవారం అర్ధరాత్రి దాటాక తెలగవీధి, సత్యనారాయణపురం తదితర ప్రాంతాల్లో భూమి క్షణకాలంపాటు స్వల్పంగా కంపించినట్టు స్థానికులు తెలిపారు. దీంతో భయంతో తాము ఇళ్ల నుంచి పరుగులు తీశామని పేర్కొన్నారు. ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని తెలిపారు.