: దేశ మ్యాప్‌లో బోల్డన్ని నదులున్నాయ్.. కానీ వాటిలో నీళ్లు మాత్రం లేవు.. మోదీ ఆవేదన


భారతదేశ మ్యాప్‌లో చూడ్డానికి చాలా నదులు ఉన్నాయని, కానీ వాటిలో నీళ్లు మాత్రం లేవని ప్రధాని నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లోని అన్నుప్పుర్ జిల్లాలో నిర్వహించిన ‘నమామి దేవి నర్మదే సేవా యాత్ర’ ముగింపు కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. నర్మదా నదిపై సర్వహక్కులు ఉన్నాయని భావించి దానిని కొల్లగొడుతూ వచ్చామన్నారు. ఆ నదీమతల్లి మన తాతముత్తాలకు జీవితాన్ని ప్రసాదించిందని, మన పూర్వీకులను కాపాడిందని పేర్కొన్న మోదీ దానిని ఇప్పుడు మనం కాపాడుకోవాల్సి వస్తోందన్నారు. గుజరాత్‌లో పుట్టిన తనకు ప్రతి నీటిబొట్టు విలువ తెలుసన్నారు. కాగా, గతేడాది డిసెంబరు 11న అమర్‌కంటక్‌లో ప్రారంభమైన యాత్ర 5 నెలలపాటు 1100 గ్రామాలు, పట్టణాల గుండా 3,344 కిలోమీటర్ల మేర సాగింది.

  • Loading...

More Telugu News