: యువతిపై ఆర్మీ అధికారి అత్యాచారం, బెదిరింపులు


హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాదులోని షామీర్‌ పేట్‌ లోని డీఆర్‌డీవోలో పాలన (అడ్మినిస్ట్రేషన్) అధికారిగా పనిచేస్తున్న రిషిశర్మ(44)కు రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఉప్పరపల్లికి చెందిన మహిళ (42) తో పరిచయం ఏర్పడింది. ఆమె తన భర్తతో విడిపోయి కుమారుడు, కుమార్తెతో కలిసి ఉంటుంది. గత జనవరిలో ఒకరోజు రాత్రి రిషిశర్మ ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆ మహిళ కుమార్తె (19) ఒక్కతే ఇంట్లో ఉండడం చూసిన రిషి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

తాను ఆర్మీ అధికారినని, విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఆమెను బెదింరించాడు. అనంతరం పలు మార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. అతను ఆర్మీ ఆఫీసర్ కావడంతో భయపడిన ఆమె విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. దీంతో ఆమె తాజాగా గర్భం దాల్చింది. దీనిని అతనికి చెప్పడంతో గర్భం తీయించుకోవద్దంటూ హెచ్చరించాడు. దీంతో విషయం తల్లికి చెప్పడంతో వారిద్దరూ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.

  • Loading...

More Telugu News