: దొరికిన బ్యాగును పోలీస్ స్టేషన్ లో అప్పగించిన 'ఆటో రాజా' నిజాయతీ!


హైదరాబాద్ ఆటోడ్రైవర్లు నిజాయతీ, మంచి మనసుతో ప్రయాణికుల మనసులు దోచుకుంటున్నారు. మొన్నామధ్య వరిజశ్రీ అనే బెంగళూరు యువతి, కన్నడ నేపథ్యగాయనికి 3000 రూపాయలు ఇచ్చి బాబా అనే ఆటో డ్రైవర్ తన పెద్ద మనసును చాటుకోగా... ఆమె సోషల్ మీడియాలో ఆ విషయాన్ని తెలపడంతో వైరల్ అయింది. తాజాగా బాలానగర్ సంగీత్ చౌరస్తాలో ముందు వెళ్తున్న వాహనంలోంచి బ్యాగు పడిపోవడం చూసిన రాజా అనే ఆటోడ్రైవర్ దానిని తీసుకుని నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు. అందులో డబ్బులతోపాటు వివిధ విలువైన పత్రాలు ఉన్నాయని, దానిని ఎలాగైనా దాని ఓనర్ కు అందించాలని కోరాడు. దీంతో పోలీసులు ఆ బ్యాగు యజమానిని గుర్తించి అందజేశారు. దీనిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. పోలీసులు, బ్యాగు యజమాని రాజా నిజాయతీని కొనియాడారు.

  • Loading...

More Telugu News