: అనితర సాధ్యమైన రికార్డు...1500 కోట్ల క్లబ్ లో చేరిన ఏకైక భారతీయ సినిమా బాహుబలి 2


'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా అనితర సాధ్యమైన రికార్డులు సాధిస్తూ దూసుకెళ్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో 9000 ధియేటర్లలో విడుదలై 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. సర్కార్-3, మేరీ ప్యారీ బిందు సినిమాలు విడుదలైనా 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమాకి పెద్దగా పోటీ ఇవ్వలేకపోయాయి. తెలుగు, తమిళ, మలయాళ సినీ పరిశ్రమల్లో 'బాహుబలి-2: ద కన్ క్లూజన్'కి ఎదురేలేకుండా పోయింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలై 20 రోజులు పూర్తి కాకుండానే 1500 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా, ప్రస్తుతానికి ఏకైక భారతీయ సినిమాగా 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా నిలిచింది.

  • Loading...

More Telugu News