: శభాష్ కేటీఆర్... రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన మంత్రి!


మంత్రి కేటీఆర్ ఓ వ్యక్తి ప్రాణం కాపాడారు. హైదరాబాదులోని హెచ్ఐసీసీ ప్రాంగణంలో నోవా టెల్‌ హోటల్ లో పని చేసే వెంకట్రావ్‌ అనే ఉద్యోగి విధులకు బైక్‌ పై వెళ్తూ కిందపడి గాయపడ్డాడు. హెల్మెట్ ఉండడంతో తలకు ఎలాంటి గాయం కాకపోయినప్పటికీ రోడ్డుపై వేగంగా కిందపడడంతో ఒంటికి గాయాలయ్యాయి. ఈ సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి కేటీఆర్‌ గాయపడ్డ ఆయనను చూసి తన కాన్వాయ్‌ ను ఆపి, తన వ్యక్తిగత సిబ్బందికి చెప్పి ఎస్కార్ట్‌ వాహనంలో దగ్గర్లోని మ్యాక్స్‌ క్యూర్‌ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆయన మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి వైద్యులకు ఫోన్‌ చేసి, వెంకట్రావ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. మంత్రి చూపిన మానవత్వానికి అందరూ ప్రశంసిస్తున్నారు. 

  • Loading...

More Telugu News