: నా దగ్గర పని చేసే ఆర్టిస్టుల గొప్పతనం అదే!: దర్శకుడు కె.విశ్వనాథ్


తన దగ్గర పని చేసే ఆర్టిస్టులు వాళ్ల ఇమేజ్ ను పక్కనపెట్టి తన వద్ద పని చేసేందుకు వస్తారని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘చిరంజీవి గురించి, కమలహాసన్ గురించి... ఇలా ఎవరి గురించి చెప్పినా.. నేను పర్సనల్ గా ఫీల్ అయ్యేంది ఏమిటంటే, వాళ్ల ఇమేజ్ ను పక్కన పెట్టి నా దగ్గర పనిచేసేందుకు వస్తారు. అదే, వాళ్ల గొప్పతనం. దాని వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడే వచ్చి నేర్చుకుంటున్నాడా? ఇదే, అతని మొదటి సినిమానా? అన్న లెక్కలో వాళ్లు ఎప్పుడైతే ప్రవర్తిస్తారో, వాళ్లకు మనం బానిసలైపోతాము’ అని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News