: ‘పోయెస్ గార్డెన్స్’లో తుప్పు పట్టిపోతున్న జయలలిత వాహనాలు!


గత ఏడాది డిసెంబరు 5న జయలలిత మృతి చెందిన విషయం విదితమే. ఆమె మృతితో అన్నాడీఎంకేలో సంక్షోభం తలెత్తడం, అంతర్గత రాజకీయాలు ఓ రేంజ్ కి చోటు చేసుకోవడం తెలిసిందే. అయితే, తనకు సంబంధించిన ఆస్తులు ఎవరికి దక్కుతాయనే విషయమై జయలలిత వీలునామా రాయలేదు. దీంతో తామే వారసులమంటూ ఎవరూ రాలేదు. ఈ నేపథ్యంలో, కోట్లాది రూపాయల ఆస్తులు ఎవరికి దక్కుతాయనేది ప్రశ్నగా మిగిలిపోయింది. జయలలిత బతికుండగా వినియోగించిన ఆమె కార్లు ప్రస్తుతం తుప్పు పట్టిపోతున్నాయి. చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో ఉన్న వాహనాల్లో లక్షలాది రూపాయల విలువ చేసే రెండు టొయోట ప్రొడొ ఎస్యూవీలు, టెంపో ట్రావెలర్, టెంపో ట్రాక్స్, మహీంద్ర జీపు, మహీంద్ర బొలెరొ, స్వరాజ్ మజ్దా మ్యాక్సీ,1990 కాంటెస్సా, 1980 నాటి అంబాసిడర్ కారు ఉన్నాయి.

  • Loading...

More Telugu News