: ఆ కల నెరవేరితే నా బయోపిక్ తీసేందుకు అంగీకరిస్తా: మాజీ అథ్లెట్ పీటీ ఉష


గోల్డెన్ గర్ల్, పయోలి ఎక్స్ ప్రెస్ అనే నిక్ నేమ్స్ గుర్తుకువచ్చే వ్యక్తి మాజీ అథ్లెట్ పి.టి.ఉష. ఆసియన్ గేమ్స్, ఆసియన్ ఛాంపియన్ షిప్స్ లో  ఆయా ఈవెంట్స్ లో తన సత్తా చాటి పతకాలను సాధించింది. అయితే, 1984 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ లో మాత్రం గోల్డ్ మెడల్ సాధించలేకపోయింది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెబుతూ, 'నా బయోపిక్ తీస్తామని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా నలుగురైదుగురు నిర్మాతల నుంచి రోజూ ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అయితే ఇది సరైన సమయం కాదని  చెప్పి తిరస్కరిస్తున్నాను. ఒలింపిక్స్ లో భారత్ కు చెందిన వ్యక్తి అథ్లెటిక్స్ లో స్వర్ణం సాధిస్తే చూడటం నా కల అని, ఆ కల నెరవేరినప్పుడు నాపై బయోపిక్ తీసేందుకు అంగీకరిస్తానని ఆ నిర్మాతలతో చెప్పాను' అని వివరించింది . కాగా, ప్రస్తుతం తన ప్రైవేట్ అకాడమీ ద్వారా 2020 టోక్యో ఒలింపిక్స్ కు యువ అథ్లెట్లకు ఆమె శిక్షణ ఇస్తోంది.  

  • Loading...

More Telugu News