: రేపు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. అనుసరించాల్సిన వ్యూహంపై తమ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ
జీఎస్టీ సవరణల బిల్లుకు ఆమోదం తెలిపే క్రమంలో రేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అయితే, ఈ సమావేశాలు ఒక్కరోజు కాకుండా రెండు లేక మూడు రోజుల పాటు కొనసాగించాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. రేపు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై విజయవాడలో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రైతుల సమస్యలపై ముందుగా చర్చించాలని, ఆ తరువాతే జీఎస్టీ బిల్ సభలో ప్రవేశపెట్టాలని వైసీపీ అంటోంది. ఈ ప్రత్యేక సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ముఖ్యంగా చర్చిస్తోంది.