: కాంగ్రెస్ ను గెలిపిస్తే రైతులకు ఒకేసారి రుణమాఫీ చేస్తాం: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రైతులకు ఒకేసారి రుణమాఫీ చేస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. వరి, మొక్కజొన్నకు రూ.2 వేలు మద్దతు ధర ఇస్తామని, కంది, పసుపునకు రూ.10 వేలు, మిర్చికి రూ.12 వేలు మద్దతు ధర ఇస్తామని అన్నారు. రైతులకు కేసీఆర్ ప్రకటించిన రూ.4వేలు ఈ ఏడాది నుంచే ఇవ్వాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News