: మంత్రాలయం వ‌ద్ద‌ రాజ‌మౌళి... సెల్ఫీలు దిగేందుకు ఎగ‌బ‌డ్డ అభిమానులు


కర్నూలు జిల్లాలోని మంత్రాలయ శ్రీ రాఘవేంద్రస్వామి వారిని సినీ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఈ రోజు ద‌ర్శించుకున్నారు. ఆయ‌న వెంట భార్య రమా రాజమౌళి, తండ్రి విజయేంద్ర ప్రసాద్, నిర్మాత సాయి కొర్రపాటిలు ఉన్నారు. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి కుటుంబం మంచాలమ్మకు కూడా మొక్కులు చెల్లించుకుంది. రాజ‌మౌళి మంత్రాల‌యానికి వ‌చ్చార‌ని తెలియ‌డంతో స్థానికులు ఆయ‌నను చూడ‌డానికి పెద్ద సంఖ్య‌లో అక్క‌డ‌కు వ‌చ్చారు. స్వామి వారి ఆలయం చుట్టూ రాజ‌మౌళి ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో సెల్ఫీలు దిగడానికి ఎగ‌బ‌డ్డారు. స్వామివారిని ద‌ర్శించుకున్న త‌రువాత రాజ‌మౌళి త‌న‌ను చూడ‌డానికి వ‌చ్చిన వారితో కాసేపు మాట్లాడారు.

  • Loading...

More Telugu News