: చైనాలో పియానో వాయించిన పుతిన్


చైనా పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పియానో వాయించారు. చైనా అధ్యక్షుడు జీ జింగ్ పింగ్ ను బీజింగ్ లో కలుసుకునే నిమిత్తం ఆయన అధికారిక నివాసానికి పుతిన్ వెళ్లారు. అయితే, జింగ్ పింగ్ కోసం పుతిన్ కొంత సమయం వేచి చూడాల్సి వచ్చింది. ఆ సమయంలో, అక్కడ ఉన్న పియానోను పుతిన్ వాయించారు. 1950ల్లో వాసిలి సొలోవ్యో-సెడాయ్ రచించిన ‘ఈవినింగ్ సాంగ్’, టికోన్ ఖెర్నినికోవ్ రాసిన ‘మాస్కో విండోస్’ ట్యూన్స్ ను పుతిన్ ప్లే చేశారు. కాగా, పుతిన్ పియానో వాయిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారాయి.

  • Loading...

More Telugu News