: ఇక 100 మంది కార్యకర్తలతో జనసేన ‘సేవాదళ్’ కార్యక్రమాలు: పవన్ కల్యాణ్
సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు తమ పార్టీ సేవాదళ్‌ను ప్రారంభించారు. అనంతపురంలోని జనసేన కార్యాలయంలో సేవాదళ్ ఆవిర్భావ సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. మొత్తం 10 అంశాలతో సేవాదళ్ నియామావళిని ఆయన ప్రకటించారు. మొదట 100 మంది కార్యకర్తలతో సేవాదళ్ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం మండల, గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామని పవన్ అన్నారు. తమ కార్యకర్తలంతా సేవాభావంతో ముందుకు వెళ్లాలని సూచించారు.