: రాజమండ్రిలో తెలుగు యూనివర్శిటీ.. అమరావతిలో ‘ఓపెన్’ యూనివర్శిటీ: మంత్రి గంటా
రాజమండ్రిలో తెలుగు యూనివర్శిటీ, అమరావతిలో ఓపెన్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 17న కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు సమావేశం కానున్నట్లు చెప్పారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై చర్చిస్తామని తెలిపారు. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 13 వరకు టీచర్ల బదిలీ ప్రక్రియ ఉంటుందని చెప్పారు.