: రాష్ట్రపతి పాలన విధించండి: ఫరూక్ అబ్దుల్లా
విద్రోహ శక్తుల కారణంగా కశ్మీర్ లోయ అల్లకల్లోలంగా తయారైంది. సైనికులపై ఏదో ఒక ప్రాంతంలో నిరంతరం రాళ్లు రువ్వడం అక్కడ సాధారణమైపోయింది. వీరిని అదుపులో పెట్టేందుకు పెల్లెట్ గన్స్స్ తో ఫైర్ చేయడం సైన్యానికి నిత్యకృత్యం అయింది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. శ్రీనగర్ లోక్ సభ స్థానానికి ఇటీవల జరిగిన ఉపఎన్నికలో ఫరూక్ అబ్దుల్లా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికలో కేవలం 7 శాతం ఓట్లు మాత్రమే నమోదయ్యాయి.