: ఆ మాట అన్నప్పుడు చాలా మంది ఎగతాళి చేశారు: సీఎం చంద్రబాబు


సింగపూర్ లాంటి సిటీని ఇక్కడ నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పుడు చాలామంది ఎగతాళి చేశారని, అయినా, అసాధ్యమేమీ కాదని చెప్పానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో 1691 ఎకరాల స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్- ఏపీ ఎంవోయూ కుదిరింది. ఈ సందర్భంగా మందడంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, ఈ కార్యక్రమం సంవత్సరం క్రితమే ప్రారంభం కావాల్సిందని, కానీ, కొంతమంది పదేపదే కోర్టులకు వెళ్లడం వల్ల ఆలస్యమైందన్నారు.

రాజధాని రైతుల త్యాగం వల్లే ఈ కార్యక్రమం జరుగుతోందని, రాజధానికి భూములిచ్చిన రైతులందరికీ పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. తన మాట మీద నమ్మకం ఉంచిన రైతులు 33 వేల ఎకరాల భూములిచ్చారన్నారు. అమరావతి పేరుకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉందని, భూలోక స్వర్గంగా అమరావతిని నిర్మిస్తామని, ప్రపంచంలోని ఐదు నగరాల్లో అమరావతి ఒకటిగా ఉంటుందని చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు.

  • Loading...

More Telugu News