: భర్త చేష్టలతో ఆమె విసుగెత్తిపోయారు: డిల్లీ సీఎం కేజ్రీవాల్ పై కపిల్‌ మిశ్రా మరో ఆరోపణ


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తోన్న ఆప్‌ బహిష్కృత నేత‌ కపిల్ మిశ్రాపై.. కేజ్రీవాల్ భార్య సునీత ట్విట్టర్ ద్వారా కపిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆమె ట్వీట్ల‌పై స్పందించిన క‌పిల్ మిశ్రా ఆ ట్వీట్లు కేజ్రీవాల్‌ భార్య సునీత చేసిన‌వి కాద‌ని, కేజ్రీవాలే త‌న భార్య‌ ఫోన్‌ నుంచి ట్వీట్లు చేసుంటాడని అన్నారు. సునీత తన బాధ్యతని చక్కగా నిర్వర్తించే భార్య అని ఆయ‌న పేర్కొన్నారు. త‌న‌ ఇంట్లో ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో కేజ్రీవాల్ భార్య‌కు తెలియదని, ఆమె అమాయకురాలని ఆయ‌న అన్నారు. భర్త చేష్టలతో ఆమె విసుగెత్తిపోయారని, సునీత‌కు వ్యతిరేకంగా తానేమీ మాట్లాడబోనని తెలిపారు. కేజ్రీవాల్ త‌న‌ భార్య ఫోన్‌ను ఆమెకు తిరిగిచ్చేయాల‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు.


  • Loading...

More Telugu News