: రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని రేవంత్ అనడం హాస్యాస్పదం: ఎంపీ గుత్తా


రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని టీడీపీ నేత రేవంత్ రెడ్డి అనడం హస్యాస్పదంగా ఉందని టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, యువతను రెచ్చగొట్టేలా రేవంత్ మాట్లాడటం సరికాదని, రెడ్డి కులస్తుల్లో ఎనభై ఐదు శాతం మంది ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లేనని అన్నారు. అవసరమైతే, సంక్షేమ నిధి ఏర్పాటు చేసి పేద రెడ్లను ఆదుకుంటామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News