: ట్విట్టర్ వేదికగా పాండ్యా బ్రదర్స్ గొడవ.. అలా చేయకూడదని చెప్పిన సెహ్వాగ్!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న పాండ్యా బ్రదర్స్ ట్విట్టర్ వేదికగా ఒకరిపై ఒకరు గొడవకు దిగారు. అయితే, వారి ట్వీట్లపై ట్విట్టర్ కింగ్, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించాడు. పాండ్యా బ్రదర్స్ లో చిన్నవాడు హార్దిక్ పాండ్యా ట్వీట్ చేస్తూ.... కొన్నిసార్లు లైఫ్‌లో మనకు చాలా దగ్గర అనుకున్నవాళ్లే మనల్ని అసంతృప్తికి గురిచేస్తారని పేర్కొన్నాడు. ఆ ట్వీట్‌పై స్పందించిన అన్న కృనాల్ పాండ్యా 'అసలు ఇది జరగాల్సింది కాదు.. నేను నీ అన్నను. ఈ విషయాన్ని ఇంతటితో వదిలెయ్' అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్లపై వారి ఫ్యాన్స్ కూడా పలు రకాలుగా కామెంట్లు చేశారు. వీటన్నింటిపై సెహ్వాగ్ స్పందిస్తూ... ఇలాంటి గొడవలు పడకూడదని ఓ సందేశాన్ని ట్వీట్ చేశాడు.
Lagta hai ,"Baap Bada Na Bhaiyya, Sabse Bada Rupaiyya" - is gaane ko jyada hi seriously le liya .Lado mat yaar !#PandyaBrosFight https://t.co/VIyWjs2YnX
— Virender Sehwag (@virendersehwag) 14 May 2017
Sometimes in life, people closest to you end up disappointing you the most. Not cool, bro!
— hardik pandya (@hardikpandya7) 14 May 2017