: నా కూతుర్ని కట్టప్ప అని పిలుస్తున్నా.. వాళ్ల నాన్న మాత్రం రౌడీ అని పిలుస్తారు: ట్వింకిల్ ఖన్నా
‘బాహుబలి-2’ సినిమా చూసినప్పటి నుంచి తన కూతురు నిటారాని తాను ముద్దుగా కట్టప్ప అని పిలుస్తున్నానని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా తెలిపింది. తన భర్త మాత్రం తమ కూతురిని రౌడీ అని పిలుస్తున్నాడని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. అక్షయ్ ‘రౌడీ రాథోడ్’ అనే సినిమాలో నటించాడు కాబట్టి నిటారాని రౌడీ అని పిలవడానికే ఇష్టపడతాడని వివరించింది. బాహుబలి సినిమాలో ఆమెకు కట్టప్ప పాత్ర ఎంతో నచ్చిందుకే ఆమె తన కూతురిని కట్టప్ప అని పిలుచుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ... కట్టప్ప తన స్నేహితుడని, బాహుబలి-2 సినిమా చూసి ఆ పాత్రకి బాగా ఎడిక్ట్ అయిపోయానని తెలిపింది. కట్టప్ప అని పేరును మూడు సార్లు పలకండి అని, ఇక అంటూనే ఉంటారని అంది. వేఫర్లు తింటే ఎలా ఎడిక్ట్ అవుతామో.. కట్టప్పకు కూడా అంతే ఎడిక్ట్ అవుతామని ఆమె అందులో పేర్కొంది.
Saw Baahubali & I've been calling my daughter Kattappa much to her dad's annoyance-Perhaps he would prefer her being called Rowdy instead:)
— Twinkle Khanna (@mrsfunnybones) 14 May 2017