: మాటలు ప్రభాస్ వి...విజువల్స్ ధోనీవి.. .వైరల్ అవుతున్న వీడియో మీరూ చూడండి


ఐపీఎల్ లో మహేంద్ర సింగ్ ధోనీ పెద్దగా రాణించినదేమీ లేదు. రానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ధోనీ ఆటతీరుపై పెద్దగా అంచనాలు లేవు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న అనంతరం ధోనీ ఆటతీరు దిగజారిపోయింది. ఈ నేపథ్యంలో ధోనీ ఆశ్చర్యపోయేలా... అతని అభిమానులు సోషల్ మీడియాలో మాషప్ వీడియో ఒకటి పోస్టు చేశారు. ఇందులో కనిపించేది మహేంద్ర సింగ్ ధోనీ అయినప్పటికీ... డైలాగులు మాత్రం మహేంద్ర  బాహుబలి (ప్రభాస్) చెప్పినవి కావడం విశేషం. 'బాహుబలి-2'లో మహేంద్ర బాహుబలి సర్వసైన్యాధ్యక్షుడిగా నియమితుడైన సందర్భంలో చేసిన ప్రమాణం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఆ వీడియోను మీరు కూడా చూసి ఆనందించండి.

  • Loading...

More Telugu News