: గురుకుల పాఠశాల ఆవరణలో నేలపై కూర్చొని బాహుబలి-2 చూసిన ఎంపీ కవిత
గురుకుల పాఠశాల ఆవరణలో నేలపై కూర్చొని టీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత నిన్న రాత్రి బాహుబలి-2 సినిమా చూశారు. ఇటీవలే ఆమె నిజామాబాద్ జిల్లా పోతంగల్ గ్రామస్తులకు ఓ మాట ఇచ్చారు. బతుకమ్మ ఆడి అనంతరం గ్రామస్తులతో కలిసి సినిమా చూస్తానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఎంపీ కవిత బతుకమ్మ ఆడిన తరువాత తన భర్త అనిల్, కుటుంబసభ్యులు, గ్రామస్తులతో కలిసి అక్కడి గురుకుల పాఠశాల వద్ద ఈ సినిమా చూశారు. గ్రామస్తులతో కలిసి ఆమె నేలపై కూర్చుని ఈ సినిమాను చూడడం విశేషం. ఈ సినిమా ప్రదర్శన కోసం ఎంపీ కవిత ప్రత్యేక అనుమతి తీసుకున్నారు.