: రిజర్వేషన్ల వల్ల అణగదొక్కబడిన కులం ఏదైనా ఉందంటే అది రెడ్ల కులమే!: జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
వందేళ్ల రిజర్వేషన్ల వల్ల అణగదొక్కబడిన కులం ఏదైనా ఉందంటే...అది కేవలం రెడ్లేనని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, రెడ్లు మరో వందేళ్లైనా సీఎం కాలేరని అన్నారు. మళ్లీ రెడ్లు బాగుపడాలంటే కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు కావడమే లక్ష్యమని అన్నారు. అలా కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు రెడ్లు అయితే అప్పుడే రెడ్లు బాగుపడతారని అన్నారు. గతంలో ముఖ్యమంత్రులు రెడ్లేనని, వారి వల్లే రెడ్లకు కష్టాలు వచ్చాయని ఆయన తెలిపారు. రెడ్డి అంటే మీసం మెలేసి తొడకొట్టాలని ఆయన సూచించారు. రాష్ట్రం రెండు ముక్కలవ్వడానికి కారణం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదని, రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగూడదన్న కుట్ర అని ఆయన స్పష్టం చేశారు.