: బ్యాంకులకు బకాయిలు నిజమే... కడిగిన ముత్యంలా బయటకొస్తా: వాకాటి


తాను బ్యాంకులకు బకాయి ఉన్న మాట వాస్తవమేనని, చెల్లించాల్సిన రుణాల రీస్ట్రక్చరింగ్ కు ప్రయత్నాలు చేస్తున్నామని ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తనపై వచ్చిన ఆరోపణల నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వుంటానని, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు, లోకేష్ లకు కృతజ్ఞతలని చెప్పిన వాకాటి, తిరిగి వారితో కలసి పనిచేసే రోజు కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. ఆర్థికమాంద్యం వల్లే వ్యాపారపరమైన ఇబ్బందులను తాను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పిన ఆయన, చాలా కాలం క్రితమే విదేశీ పెట్టుబడులు తమ సంస్థకు వచ్చాయని అన్నారు. రెండు మూడు నెలల్లో అంతా సర్దుకుంటుందన్న నమ్మకం ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News