: మెట్రో పిల్లర్ ను ఢీకొన్న కారు.. సీఐకి తీవ్ర గాయాలు
జూబ్లీహిల్స్ లో మెట్రో పిల్లర్ ను ఢీకొన్న ఘటనలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనను మరువక ముందే అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. హైదరాబాదు, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట అష్టలక్ష్మి దేవాలయ కమాన్ వద్ద ఈ ఉదయం ప్రమాదం జరిగింది. ఎల్బీ నగర్ నుంచి కొత్తపేటకు వేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్ ను ఢీకొంది. ఈ ఘటనలో కారులో వస్తున్న సీఐ వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని... సీఐను దగ్గర్లో ఉన్న ఓమ్నీ ఆసుపత్రికి తరలించారు.